కరోనా ఇంకా వెంటాడుతుందని మర్చిపోవద్దు.. మోదీ హెచ్చరిక
TeluguStop.com
జాతినుద్దేశించి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.ఈ సందర్భంగా కరోనా ప్రభావంపై మాట్లాడారు.
కోవిడ్‌పై ఇంకా పోరాటం కొనసాగుతుందని, దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు.కరోనాను ఎదుర్కొవడంతో ఇతర దేశాల కంటే భారత్ మెరుగ్గా ఉందన్నారు.
ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దామన్నారు.కరోనా టెస్టుల కోసం 2 వేల ల్యాబ్‌లు పని చేస్తున్నాయని మోదీ చెప్పారు.
త్వరలోనే కరోనా టెస్టుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందన్నారు.కరోనాపై పూర్తి విజయం సాధించే వరకు పోరాటం ఆపవద్దని, మీరు.
మీ కుటుంబాలు సేఫ్‌గా ఉండాలన్నారు.కరోనా ఇంకా వెంటాడుతూనే ఉందని మర్చిపోవద్దని మోదీ హెచ్చరించారు.
10 లక్షల కేసుల్లో 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయన్నారు.మాస్క్ లేకుండా బయట తిరిగి ప్రమాదం తెచ్చుకోవద్దని, ఇతరులను ప్రమాదంలోకి నెట్టవద్దన్నారు.
అమెరికా, బ్రెజిల్, స్పెయిన్ దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోందని, మన దేశంలో ఇటీవల కరోనా ప్రభావం కాస్త తగ్గిందని మోదీ తెలిపారు.
పోలీసులు, సైనికులు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని, వారిని అందరూ అభినందిచాలని మోదీ తెలిపారు.
కరోనా పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని, ఏ మాత్రం ఆదమరించినా ఇబ్బందులు తప్పవన్నారు.
వ్యాక్సిన్ వచ్చేంతవరకు కరోనాపై పోరాటం చేయాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు.ప్రజలు మాస్కులు లేకుండా అసలు తిరగొద్దని, ఇది రిస్క్ తీసుకునే సమయం కాదన్నారు.
విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?