కీరవాణి రాగం మొదలుపెట్టిన ఆర్ఆర్ఆర్

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ శరవేగంగా తెరకెక్కుతోంది.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో సౌత్ ఆడియెన్స్‌తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

గతంలో బాహుబలి చిత్రం సృష్టించిన విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆతృతగా ఉన్నారు.

రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మరోసారి ఈ సినిమాతో తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో కీరవాణి ఆర్ఆర్ఆర్ కోసం సంగీతం అందించడం మొదలుపెట్టాడు.

ఆర్ఆర్ఆర్‌కు ప్రాణంపోసే బీజీఎం రికార్డింగ్‌ను ఆయన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు అత్యంత కీలకమైన బీజీఎంను కీరవాణి మొదలుపెట్టడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో వచ్చే జనవరి 8న రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, ఆలియా భట్ తదితరులు నటిస్తు్న్నారు.

ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మార‌తారు!