ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు సిద్దంగా వుండాలి: సిఈసి వికాస్ రాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఈ నెల 27 న జరగనున్న నల్గొండ, ఖమ్మం,వరంగల్ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు,పోలీస్ సూపరింటెండెంట్లకు తెలిపారు.

బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పట్టభద్రుల ఉప ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని,ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని,ఎన్నికలలో ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం సరఫరా చేసిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్,ఇండెలిబుల్ ఇంకులు మాత్రమే వినియోగించాలని తెలిపారు.

ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగిసినందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చేయి మధ్య వేలుకు ఇండెలిబుల్ ఇంక్ మార్కు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బయట ప్రదర్శించాలని,అదేవిధంగా ఓటర్లు ఓటు ఎలా వేయాలో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.

బెన్షాలోమ్, సహాయ రిటర్నింగ్ అధికారులు అమరేందర్,శేఖర్ రెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి,జిల్లా చేనేత జౌలీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విద్యాసాగర్,ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారీ తదితరులు పాల్గొన్నారు.

ఈ జన్మలో ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా ? అప్పటి వరకు మనం ఉంటామా ?