కేంద్రంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం
TeluguStop.com
కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేంద్రం రైతు వ్యతిరేక చర్యలు చేపడుతోందని ఆరోపించారు.
ఎనిమిది ఏళ్లలో రైతులకు ఉపయోగపడేలా ఒక్క పనీ చేయలేదని విమర్శించారు.మహారాష్ట్ర, కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.
ఒక కుటుంబంలో ఒక్కరికే పీఎం కిసాన్ పరిమితం చేసిందని తెలిపారు.పీఎం కిసాన్ రద్దు చేయమంటూనే ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
సంయుక్త కిసాన్ ఉద్యమానికి టీఆర్ఎస్ మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు.కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ కార్యకర్తలా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన లాభం లేదా… ప్రతివారం అలా చేయాల్సిందేనా?