మెట్టినిల్లు నిజామాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
TeluguStop.com
బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్న ఎమ్మెల్సీ కవిత.ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
తన మెట్టినిల్లు నిజామాబాద్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఈ నెల 23 న దుబాయ్ లో బతకమ్మ పండుగపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా హాజరుకానున్నారని తెలిపారు.
ఒకప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ఘనంగా బతుకమ్మను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
బతుకమ్మ పండుగను అధికారంగా జరుపుకోవడం, బతుకమ్మ చీరలు ఇవ్వడం, తంగేడు రాష్ట్ర పువ్వు కావడం లాంటివన్నీ తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రూపొందించిన బతుకమ్మ పాట ద్వారా, బతుకమ్మ పండుగపై మరోసారి దేశ విదేశాల్లో చర్చ జరిగిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
నిజామాబాద్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా కమీషన్ సభ్యురాలు సుధాం లక్ష్మి, మేయర్ నీతూ కిరణ్, జిల్లా కలెక్టర్ సతీమణి మనీషా, పోలీస్ కమీషనర్ సతీమణి రీచా, జెడ్పీ ఛైర్మన్ సతీమణి అనసూయ, మహిళా ప్రజాప్రతినిధులు, ఆడబిడ్డలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రమోషన్స్ విషయంలో బన్నీకి బన్నీనే సాటి.. మిగతా హీరోలు ఈ విషయంలో మారతారా?