సీఎం కేసీఆర్ తో భేటీకానున్న ఎమ్మెల్సీ కవిత..!
TeluguStop.com
హైదరాబాద్ ప్రగతిభవన్ కు ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు.ఈ క్రమంలో లో సీఎం కేసీఆర్ తో మరికాసేపటిలో భేటీకానున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆమెకు విచారణకు రావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై కేసీఆర్ తో చర్చించనున్నారని తెలుస్తోంది.కాగా ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు కవిత సిద్ధమైన విషయం తెలిసిందే.
ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?