ఢిల్లీ ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత..!

ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు.ఈ క్రమంలో ఆమె కాన్వాయ్ వెంట పార్టీ శ్రేణులు భారీగా వెళ్తున్నారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కవితను ఇవాళ ఈడీ అధికారులు విచారించనున్నారు.

రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో ఆమెతో పాటు మరో తొమ్మిది మంది ఈడీ ప్రశ్నించనుంది.

మరోవైపు కవిత కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు.

దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

పెళ్లి పెటాకులు లేవు నన్ను వదిలెయ్యండి ప్లీజ్.. పవన్ కళ్యాణ్ ను వేడుకున్న శ్రీ రెడ్డి!