Delhi Liquor Scam Case : లిక్కర్ స్కాం కేసులో నాలుగో రోజు కస్టడీకి ఎమ్మెల్సీ కవిత..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో ఈడీ విచారణ కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రవర్తన్ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha )ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఈ మేరకు నాలుగో రోజు కస్టడీలోకి తీసుకోనున్న అధికారులు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆమె పాత్రపై ఆరా తీయనున్నారు.

కేసులో ఉన్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. """/"/రూ.

100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మరియు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) తో ఒప్పందాలపై కవితను ఈడీ విచారిస్తోంది.

రోజుకు సుమారు ఆరు నుంచి ఏడు గంటల పాటు సీసీటీవీల పర్యవేక్షణలో కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు కస్టడీలో ఉన్న కవితను ఆమె తల్లి శోభ, పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నలుగురు భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్ .. ఏం చేశారంటే?