నేటి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత దూరం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావడం లేదు.ఈ మేరకు ఈడీ అధికారులకు ఆమె సమాచారం అందించారు.

నిజామాబాద్ జిల్లా పర్యటనను ముగించుకున్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ క్రమంలోనే పార్టీ లీగల్ టీమ్ తో చర్చించిన తరువాత ఆమె ప్రగతిభవన్ కు వెళ్లనున్నారు.

సీఎం కేసీఆర్ తో సమావేశమై ఈడీ నోటీసులతో పాటు తాజా పరిణామాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.

కాగా ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ నిన్న నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

అయితే మహిళల ఈడీ విచారణపై మార్చి 14న సుప్రీంలో కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

పుష్ప ది రూల్ ఫస్ట్ డే టార్గెట్ అన్ని రూ.కోట్లా.. ఆ తప్పు మాత్రం మైనస్ కానుందా?