గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు.

కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు.

కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తమ పోరాటమని పేర్కొన్నారు.

ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ తమిళిసైకి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.