20వ తేదీ.. కవితక్క భయపడుతోందా ?

గత కొన్నిరోజులుగా డిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ స్కామ్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా ఈడీ పేర్కొంది.దాంతో ఇప్పటికే కవిత ఈడీ రెండు సార్లు విచారించింది కూడా.

ఈ నేపథ్యంలో కవితా అరెస్ట్ కావడం ఖాయమని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.ఈ నెల 11న కవితను రెండవసారి విచారించిన ఈడీ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించింది.

దాదాపు 9 గంటల పాటు కవితను పలు రకాల ప్రశ్నలతో ఈడీ ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే విచారణ అనంతరం కవితా అరెస్ట్ కాబోతుందనే వార్తలు వచ్చినప్పటికి మరోసారి ఈ నెల 16న విచారణకు పిలుపునిచ్చింది ఈడీ.

దాంతో లిక్కర్ స్కామ్ విషయంలో అసలేం జరుగుతోందనే చర్చ అందరిలోనూ ఉంది. """/" / కాగా 16న హాజరు కావల్సిన విచారణకు కవితా గైర్హాజరు అయ్యారు.

దాంతో ఈడీ మరోసారి నోటీసులు ఇస్తూ ఈ నెల 20న హాజరు కావాల్సిందిగా కోరింది.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా కవితా ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు( Supreme Court )ను ఆశ్రయించారు.

ఒక మహిళను రాత్రి 8 గంటల వరకు ఈడీ ఆఫీస్ లో విచారణ జరపడం ఏంటని పిటిషన్ లో పేర్కొన్నారు కవిత.

దీనిపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీం కోర్ట్ ను కోరగా కవితా వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది.

దీనిపై ఈ నెల 24న విచారణ చేపడతామని అత్యున్నత న్యాణస్థానం చెప్పుకొచ్చింది.దాంతో సుప్రీం కోర్టు విచారణ కంటే ముందే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎమ్మెల్సీ కవిత.

ఈ పరిణామలే రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. """/" / కవితా అరెస్ట్ ( MLC Kavitha )భయంతోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారనే వాదన పోలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.

కాగా ఈ నెల 20న జరిగే రెండో సెషన్ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే.

ఎందుకంటే 16నే హాజరు కావాల్సి ఉండగా ఆయా కారణాల తో ఆమె హాజరు కాలేదు.

ఇక 20 విచారణను తప్పించుకునేందుకు సుప్రీం కోర్టు ను ఆశ్రయించినప్పటికి చుక్కెదురైంది.దీంతో విచారణను తప్పించుకునేందుకు కవిత తరువాత ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఒకవేళ 20 తేదీ విచారణకు కవిత హాజరు అయితే అరెస్ట్ కావడం అనివార్యం అని కమలనాథులు చెబుతున్నారు.

మొత్తానికి డిల్లీ లిక్కర్ స్కామ్ ఉచ్చులో బి‌ఆర్‌ఎస్ చిక్కుకోవడంతో కే‌సి‌ఆర్ కే‌సి‌ఆర్ తరువాత ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం.

Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి