తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

ఏపీ సీఎం వైస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు స్వర్ణ యుగం వచ్చిందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొనియాడారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

గురువారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.దర్శనంతరం ఆలయ వెలుపల ఆయన మాట్లాడుతూ.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పారు.బుధవారం జరిగిన బిసి గర్జనను ప్రజలు విజయవంతం చేశారని, దేశ చరిత్రలోనే బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.

136 కులాలను గుర్తించి వాటికీ ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లను ఏర్పడు చేసిన ఘనత సీఎం జగన్ దేనని, ఆ కార్పొరేషన్ లకు 1లక్ష 75వేల కోట్లను సీఎం జగన్ కేటాయించారని చెప్పారు.

అనేక సంక్షేమ పధకాలను అమలు చేసి, బీసీలను అభివృద్ధి వైపు నడుపుతున్న మహా నేత సీఎం జగన్ అని, బీసీలను డిప్యూటీ సీఎంను చేసిన ఘనత సీఎం జగన్ కె దక్కిందని కొనియాడిన ఆయన, ఈ ప్రభుత్వంలో అణగారిన వర్ణాలకు, బీసీ నాయకులకు న్యాయం జరగదని నమ్ముతున్నారని, బీసీలను అణగతొక్కిన పార్టీ టీడీపీ అని, ఇద్దరు బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్ళు జడ్జ్ లు అవుతుంటే అడ్డుకున్నవాడు చంద్రబాబు అని ఆయన ఆరోపించారు.

జగన్ ద్వారా బిసిలకు స్వర్ణయుగం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బిసిలు ఏకం అయ్యి జగన్ ను అత్యధిక మెజారిటీ సాధిస్తారని ఆయన అన్నారు.

నకిలీ పత్రాలతో ఎన్ఆర్ఐ భూమి విక్రయం.. సబ్ రిజిస్ట్రార్ సహా 9 మంది అరెస్ట్

నకిలీ పత్రాలతో ఎన్ఆర్ఐ భూమి విక్రయం.. సబ్ రిజిస్ట్రార్ సహా 9 మంది అరెస్ట్