ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఊరట
TeluguStop.com
ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.రాజమండ్రి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.
తనకు మరికొన్ని రోజులు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.
అనంతబాబుకు సెప్టెంబర్ 5 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్సీ తల్లి కన్నుమూశారు.ఈ క్రమంలో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయనకు 3 రోజులపాటు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా..?