గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:గత పాలకుల కాలంలో వ్యవసాయం దండగ అనుకున్న రైతన్నలు నేడు వ్యవసాయం పండుగలా చేస్తున్నారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

మంగళవారం మునగాల ముత్యాల హెడ్ రెగ్యులేటరీ వద్ద సాగర్ ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్టం సిద్ధించిన తర్వాత నాగార్జునసాగర్ కెనాల్ కింద మూడు పంటలకు నిరుస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు బంధు,రైతు భీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ నేడు రైతుకు ధీమాగా ఉన్నాయన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని రైతుల పక్ష పాతిగా ఉన్నారన్నారు.

రైతులకు చివరి భూముల వరకు నీటిని అందిస్తామన్నారు.రైతులు సాగు నీరు కోసం ఉన్న ఇబ్బందులు పరిష్కరిస్తానన్నారు.

ఈ సందర్భంగా నెలకొన్న పండుగ వాతావరణంలో నీటి విడుదల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, టిఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు,ఉప్పుల యుగంధర్ రెడ్డి,సర్పంచులు ఉపేందర్,వీరమ్మ, గ్రంధాలయ చైర్మన్ నాగరాజు,టిఆర్ఎస్ నాయకులు ప్రదీప్,గన్న నరసింహారావు,ఎల్పి రామయ్య,వీరు, నాగరాజు,వీరయ్య,నీటిపారుదల అధికారులు సత్యనారాయణ,నరేందర్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: ఏనుగుకు తిక్క రేగితే ఇలాగే ఉంటుంది మరి