గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ….

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్ 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు టీడీపీలో ఉన్న మేము నమ్మలేదు.

ఆనాడు టీడీపీలో ఉన్న అపర మేధావులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని గెలిచాక చెత్తబుట్టలో వేస్తారని చంద్రబాబు అండ్ కో చెప్పేవాళ్ళు.

చంద్రబాబు లాంటి మేధావులు చెప్పారు కాబట్టి మేము వాళ్ళ మాట వినాల్సి వచ్చింది.

సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి అన్ని హామీలు అమలు చేస్తున్నాడు.

క్యాలెండర్ వేసిమరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది.

జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి,ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వంటి పథకాలకు ఆకర్షితుడై మద్దతు తెలిపాను.

గ్రామాల్లో 90 శాతం కుటుంబాలకు కులం,మతం,రాజకీయం చూడకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి.గత టీడీపీ ప్రభుత్వంలో ఇంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు కాలేదు.

గ్రామాల్లో గడపగడపకు తిరుగుతున్న సమయంలో ఏఒక్కరూ సంక్షేమ పథకాలు అందలేదని చెప్పడం లేదు.

టీడీపీ వారికి వామపక్షాలకు నేను టీడీపీ కి ఓటు వేస్తే నాకు వచ్చే సంక్షేమ పథకం ఆపేశారు అని పట్టుమని 10 మందిని తీసుకు వచ్చి డిబేట్ పెట్టిన పర్వాలేదు.

లక్ష 20వేల కుటుంబాలతో ఉన్న నియోజకవర్గం లో 10 మంది తో నిరూపిస్తే నేను వెంటనే రాజీనామా చేస్తాను.

వల్లభానేని వంశీ కి కొడాలి.నాని కి నియోజకవర్గం అనేది ఒకటి ఉంది.

చంద్రగిరి నియోజవర్గం నుంచి పారిపోయి 40 ఏళ్ళు అవుతుంది ఇంకో నియోజకవర్గం కోసం షెల్టర్ వెతుక్కుంటున్న వ్యక్తి చంద్రబాబు.

చంద్రబాబు నియోజకవర్గం చంద్రగిరి అతను పోటీచేసేది కుప్పం… చంద్రబాబు అతని సుపుత్రుడు లోకేష్ ఏ నియోజకవర్గాల్లో పోటీచేస్తారు.

వాళ్ళు గెలుస్తారా అసలు గెలిచి అసంబ్లీకి వస్తారా ప్రజాస్వామ్యం లో ఎవరైనా ఎవరితో అయిన కలిసి పోటిచెయ్యవచ్చు.

ఎవరు ఎవరు తో కలిసి పోటీచేసిన అంతిమ తీర్పు ఇచ్చేది కేవలం ప్రజలు మాత్రమే.

కొత్త ఆటోతో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. బెంజ్ కారు కొన్నవారికంటే హ్యాపీగా ఉన్నాడే..?