గన్నవరంలోని పానకాల చెరువును రిజర్వాయర్ గా చేసేందుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
TeluguStop.com
కృష్ణాజిల్లా : గన్నవరం నియోజకవర్గం.గన్నవరంలోని పానకాల చెరువును రిజర్వాయర్ గా చేసేందుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్.పానకాల చెరువు రిజర్వాయర్ ద్వారా గన్నవరం ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుంది.
చెరువు పూడిక తీసిన మట్టిని గన్నవరం నియోజకవర్గంలోని జగనన్న లేఔట్ లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.
కాటికి కాలు చాపిన వాడికి స్మశానం గుర్తుకు వస్తుంది.చంద్రబాబు కాటికి కాలు చాపాడు కాబట్టి పేదలకు ఇస్తున్న సెంటు స్థలంను సమాధులతో పోల్చాడు.
ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడు.గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువశాతం ఇళ్ళు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు.
అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు జగన్మోహన్ రెడ్డి ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.
పేద ప్రజలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు పనికిమాలిన సన్నాసులు.అమ్మ పెట్టదు అడక్కు తిన్నవ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి.
గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమికుడా పేదలకు ఇవ్వలేదు.గత ప్రభుత్వంలో సెంటు భూమికుడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే వాళ్ళను విమర్శించడానికి సిగ్గుసెరం ఉండాలి.