ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు రేపటికి వాయిదా

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

కేసుపై సీబీఐ విచారణ మొదలైందా అని కోర్టు ప్రశ్నించింది.ఫైల్స్ అప్పగించాలని సీబీఐ ఒత్తిడి తీసుకు వస్తుందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు.

మరోవైపు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు ఉత్తర్వులు అమలు చేయొద్దని ప్రతివాది లాయర్ కోరారు.

దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్ని రోజులు పడుతుందని హైకోర్టు ప్రశ్నించగా.వారం రోజుల సమయం పడుతుందని ఏజీ వెల్లడించారు.

ఈ మేరకు కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.అయితే సీబీఐతో దర్యాప్తు చేయించాలని సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ ను సర్కార్ పిటిషన్ ను కొట్టి వేసింది.

ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది ప్రభుత్వం.

తాము సుప్రీంకు వెళ్లేంత వరకు స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది… అందుకు ఎవరు అతీతులు కాదు