చంద్రబాబు పై సీరియస్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా..!!
TeluguStop.com
టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి బోస్ డికే అని వ్యాఖ్యలు చేయటం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
జగన్ నీఇంత దారుణంగా విమర్శించటం తో వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ ఉన్నాయి.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో చేపట్టిన జనాగ్రహ దీక్ష లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం.
చంద్రబాబు కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.
చంద్రబాబు నారా లోకేష్ కలిసి పట్టాభి లాంటి కుక్కతో మీడియా సమావేశం పెట్టించి.
ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్ ని వారి తల్లి విజయమ్మ పైన బూతులు తిట్టిన చేయడం జరిగిందని.
ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమని.పేర్కొన్నారు.
పట్టాభి చేసిన వ్యాఖ్యలనీ ఖండిస్తున్నమని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని చంద్రబాబు అంటున్నారు.
అస్సలు ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి.పదవి లాక్కున్నప్పుడే ప్రజాస్వామ్యం.
కూనీ అయిపోయిందని పేర్కొన్నారు.కేంద్ర బలగాలు రాష్ట్రం లోకి రావాలని చంద్రబాబు అంటున్నారు మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గతంలో కేంద్ర బలగాలు విచారణ సంస్థలు.
రాకుండా ఆయనే జీవోలు విడుదల చేశారు.మళ్లీ ఇప్పుడు ఆయనే కేంద్ర బలగాలు రాష్ట్రంలోకి రావాలని అంటున్నారు అంటూ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు.
సర్జరీ చేయించుకున్న యాంకర్ ప్రదీప్… అందుకే గ్యాప్ ఇచ్చారా.. ఏమైందంటే?