రోజా కి అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తన పంథా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఇక క్యాబినెట్ ఏర్పాట్లు కూడా సామాజిక వర్గాల వారీగా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పించే విధంగా మంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించారు.

ఈ సామాజిక సమీకరణల్లో వైసీపీ పార్టీ మహిళ లీడర్ ఎమ్మెల్యే రోజా కి మంత్రి పదవి వస్తుందని అనుకున్నా కూడా ఊహించని విధంగా ఆమెకు అవకాశం దక్కలేదు.

అయితే మంత్రి పదవి రాకపోవడం పై ఆమె ఆవేదన చెందారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని మీడియాలో కథనాలు వినిపించాయి.

వాటికి పుల్ స్టాప్ పెడుతూ రోజా అసెంబ్లీ సమావేశాలకు హాజరై జగన్ తో ముచ్చటించింది.

ఇక వైసీపీ గెలుపు లో రోజా పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అని చెప్పాలి.

ఆమె పార్టీ కోసం చేసిన గుర్తించిన జగన్ మంత్రి పదవి లేకపోయినా కూడా మరో కీలకమైన బాధ్యతలు అప్పగించారు.

అందులో మంత్రి పదవితో సమానమైన ఏపీఐఐసీ, ఆర్టీసీ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ లలో ఏదో ఒకటి తీసుకోమని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే రోజా ఆ నిర్ణయం జగన్ కి వదిలేయడంతో ముఖ్యమంత్రి జగన్ రోజాకి ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు.

ఇప్పుడు కీలకమైన పదవి ఆమెకు ఇవ్వడంతో రోజా కూడా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.