పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రేఖానాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంత్రి పదవి రేసులో ఉన్న కారణంగానే తనకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు.ఎన్నికల వరకు ఉన్న సమయంలో ప్రతి గ్రామంలో పర్యటించి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానన్నారు.

బీఆర్ఎస్ కేడర్ తనతోనే ఉందన్న రేఖా నాయక్ ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.

అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టబోతున్నారా..?