కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్..!
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలోని పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే రేగా కాంతారావు వెళ్లారు.ఈ క్రమంలో ఆయనను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే రేగా కాంగ్రెస్ కార్యకర్తలను నెట్టివేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
జూనియర్ ఎన్టీఆర్ నుంచి సాయం అందలేదు.. కౌశిక్ తల్లి సంచలన వ్యాఖ్యలు వైరల్!