ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలకు ఉండి ఎమ్మెల్యే రాజు కౌంటర్

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలకు ఉండి ఎమ్మెల్యే రాజు కౌంటర్ ఇచ్చారు.వేపాక వరప్రసాద్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు.

తన ఇమేజ్ ను పెంచుకోవటానికి కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.అదేవిధంగా నాయకుడు మెప్పు  కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రాపాక ఏ పార్టీలో గెలిచారన్న ఎమ్మెల్యే రాజు ఆయన ఏ పార్టీ కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు.

అయితే ఎమ్మెల్యే రాజు ద్వారానే టిడిపి తనకు క్రాస్ ఓటింగ్ కు పాల్పడాలని  ఆఫర్ ఇచ్చిందని రాపాక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి హేమ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా.. ఈ నటి భర్త ఎవరంటే?