బీజేపీలోకి ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి..?

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి.కాంగ్రెస్ నుంచి జంప్ అవుతారా లేదా ఇంకా క్లారిటీ రాలేదు.

కానీ అక్కడి ఓటర్లు మాత్రం మీరు పార్టీ మారండి.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండని కోరుతున్నారు.

మీరు రాజీనామా చేస్తే.ఇక్కడ గెలవడానికి సీఎం కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతారని.

మునుగోడు ఓటర్ల అభిప్రాయం.గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావించి.

కేసీఆర్ భారీ ఎత్తున మునుగోడుకు నిధులను పంపుతారని.ఇక్కడి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.

ఇందుకు గత హుజూరాబాద్ ఎన్నికలను ఉదహరణగా చూపుతున్నారు.అక్కడ ఈటలను ఓడించడానికి భారీ ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టారు.

ఓటర్లకు వేలకు వేలు డబ్బులు పంచారు.అయినా.

ఈటల గెలిచారు.హుజూరాబాద్ ప్రజలకు అభివృద్ధి మిగిలింది.

ఇప్పుడు మునుగోడు ఓటర్లు ఇదే కోరుకుంటున్నారు.కాంగ్రెస్‎లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం చివరి అంకానికి చేరింది.

బీజేపీలో చేరేందుకే రాజగోపాల్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.రాజగోపాల్ రెడ్డితో భట్టి విక్రమార్క జరిపిన చర్చలు ఫలించలేదని సమాచారం.

రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా బీజేపీలో చేరతామని చెప్పకపోయినా.ఆయన వ్యవహార శైలి మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజగోపాల్ రెడ్డిని పార్టీలో కొనసాగించడానికి ఏం కావాలో అడగాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దిగ్విజయ్ సింగ్ కోరారు.

రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ను దిగ్విజయ్ సింగ్కు అధిష్టానం అప్పగించింది.దిగ్విజయ్తోపాటు రేవంత్ వ్యూహకర్త సునీల్కు బాధ్యతలు చేపట్టారు.

మరోవైపు రాజగోపాల్ బీజేపీలో చేరబోతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డితో ఇప్పటికే కిషన్ రెడ్డితో కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం.

వీడియో: రీల్స్ కోసం కొండ అంచుకు చేరుకున్న యువతి.. చివరికి..?