మన దేశంలో పిఛన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.నిరుపేదల్లోని వృద్ధులకు మాత్రమే ఇలా పిఛన్లు ఇస్తుంటారు.
ఎందుకంటే మన దేశంలో ఇలా ఏమీ లేని పేద వృద్ధులు కోట్లలో ఉన్నారు.
గ్రామాల్లో అయితే ఈ పింఛన్ కోసం వృద్ధులు ఎన్ని పాట్లు పడుతారో అందరికీ తెలిసిందే.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఇప్పటికీ చాలామంది తిరుగుతూనే ఉన్నారు.చాలామంది నిరుపేద వృద్ధులు అయితే పింఛన్ ఇవ్వండి సార్లూ అంటూ తెలిసిన వారి కాళ్ల మీద పడుతూనే ఉన్నారు.
ఇన్ని చేస్తున్నా కూడా వారికి పింఛన్లు రాక నానా అసవ్థలు పడుతున్నారు.ఇలాంటి సమయంలో ఏపీలో ఇప్పుడు జరిగిన ఘటనతో పబ్లిక్ ఫైర్ అవుతున్నారు.
అదేంటంటే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే తల్లికి ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసర్లు పింఛన్ ఇవ్వడం పెద్ద సంచలనమే రేపుతోంది.
ఎందుకంటే నిరుపేదలకు ఇవ్వాల్సిన పింఛన్ ను ఇలా ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే తల్లికి ఈ విధంగా ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
విషయం ఏంటంటే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రస్తుతం ఉన్నారు.అయితే ఆయన తల్లి తులశమ్మకు ఆఫీసర్లు పింఛన్లు ఇస్తున్నట్టు తెలిసింది.
ఇంకేముంది కోడూరు నియోజకవర్గంలో చాలామంది నిరుపేద వృద్ధులు ఎంతో మంది ఉన్నా కూడా వారికి ఇవ్వకుండా ఇలా తమ తల్లికి ఇవ్వడమేంటని ఎమమ్ఎల్యేపై టీడీపీ ఫైర్ అవుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన వృద్ధులకు పింఛన్లు రావట్లేదని టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం బయట పడటంతో పబ్లిక్ కూడా ఫైర్ అవుతున్నారు.
ఈ విషయం ఇప్పుడు నియోజకవర్గ వైసీపీలో కూడా పెద్ద దుమారమే అవుతోంది.మరి ఎమ్మెల్యే వీటిపై ఏమైనా స్పందించి ఆపేస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.