కాల్వ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా నా వద్ద ఉంది – ఎమ్మెల్యే పెద్దారెడ్డి
TeluguStop.com
అనంతపురము, తాడిపత్రి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి కామెంట్స్.జేసి సోదరులు కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు టిడిపి వారిపై దాడి జరిగినప్పుడు కాలువ శ్రీనివాసులు ఎందుకు మాట్లాడలేదు.
త్రిశూల్ మైనింగ్ పరిశీలనకు వచ్చిన టిడిపి నాయకులు జెసి నివాసంలోనే భోజనం చేసిన మాట వాస్తవం కాదా!ఒక వ్యక్తి గురించి మాట్లాడే టప్పుడు ఆవ్యక్తి ఎలాంటి వారని తెలుసుకొని మాట్లాడాలి.
జెసి ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని చెప్పాల్సిందిపోయి నాపై వాఖ్యలు చేస్తారా.
కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసు.తాడిపత్రిలో జేసి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరు.
కాలవ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా నా వద్ద ఉంది.జేసి ప్రభాకర్ రెడ్డి చెబితేనే నాపైన కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతారు.
నా గురించి మాట్లాడితే మీ రాజకీయ జీవితం బినామీల గురించి చిట్టా విపాల్సి ఉంటుంది.
గతంలో తాడిపత్రి టిడిపి నాయకులపై దాడులు జరిగిన కాపాడిన చరిత్ర మీకు లేదు.
మీరందరూ కలిసిన నన్ను కట్టడిచేయలేరు .మీరందరిని, మీ పార్టీ వారిని కట్టడి చేసే శక్తి భగవంతుడు నాకు ఇచ్చారు.
కాల్వ శ్రీనివాసులు ఇలాగ మాట్లాడితే మీ అవినీతిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చిన అధికారులు లాగానే మీ ఇంటికి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు.
మీరందరూ కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరు.
ఆ డైరెక్టర్ పై ప్రేమను మాటల్లో చెప్పలేను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!