ఐటీ విచారణకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఐటీ విచారణపై సస్పెన్ష్ కొనసాగుతోంది.ఇవాళ ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది.

అయితే వారం రోజుల క్రితం ఎమ్మెల్యే ఇంటిలో ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ తనిఖీలలో భాగంగా పలు కీలక పత్రాలతో పాటు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.

దాంతో పాటు శేఖర్ రెడ్డి బ్యాంకు లాకర్స్ ను కూడా అధికారులు ఓపెన్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకావాలని శేఖర్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

అదేవిధంగా ఎమ్మెల్యే మర్రి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా ఐటీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అమ్మాయిలు రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన హాస్టల్ వార్డెన్‌.. చివరికి?