ఎమ్మెల్యే మైనంపల్లి భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ..!
TeluguStop.com
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు రాజకీయ భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయన మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ సైతం ఖండించారు.హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీకి మూలస్తంభంగా ఉంటారని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో హరీశ్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి పోటీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అనుచరులు చెబుతున్నారు.
కాగా మైనంపల్లి రేపు తిరుపతి నుంచి రేపు హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో తనయుడు కోసం మైనంపల్లి పార్టీ మారతారా.
? రాజకీయంగా ఆయన భవిష్యత్ ఏంటన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆ డైరెక్టర్లతో ప్లాన్ చేయొచ్చుగా బాలయ్యా.. మోక్షజ్ఞ విషయంలో ఇలా చేయడం రైటా?