వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ అసంతృప్తి

వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశఏఖర్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా నాగసముద్రంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ క్రమంలో గ్రామాలలో రోడ్లు వేయాలని గ్రామస్తులు కోరారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి సిమెంట్ రోడ్లను వేయలేమని తేల్చి చెప్పారు.పెండింగ్ బిల్లులకు డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు.

అందుకే అభివృద్ధి పనులు చేయడం కష్టమని స్పష్టం చేశారు.