MLA Lasyanandita : అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్యనందిత అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత( BRS MLA Lasyanandita ) అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ( S Shantikumari )సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ పై సుల్తానాపూర్ వద్ద లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో ఆమె స్పాట్ లోనే చనిపోగా.కారు డ్రైవర్ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మరోవైపు లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది.

దీంతో ఆమె మృతదేహాన్ని కంట్మోనెంట్ లోని ఆమె నివాసానికి తరలించనున్నారు.