ఘనంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా బర్త్డే వేడుకను బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఆధ్వర్యంలో మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్ పాల్గొని ఘనంగా నిర్వహించారు.

మొదటగా ఎల్లారెడ్డిపేట సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం పాత బస్టాండులో టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు.

అనంతరం స్థానిక మాజీ జెడ్పిటిసి కార్యాలయం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అందే సుభాష్, ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశరాం గౌడ్, ఎనగందుల అనసూయ నర్సింలు, సింగిల్ విండో డైరెక్టర్ నేవురి వెంకట నరసింహారెడ్డి, మీసం రాజ్యం,మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా,నలిమికుండా శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు, బందారపు బాల్రెడ్డి, గుండాడి వెంకట్ రెడ్డి, బాధ రమేష్, నాగరాజు, ఆకుల మురళి, తదితరులు పాల్గొన్నారు.

జగన్ ఢిల్లీ ధర్నా ఎఫెక్ట్ … ఆ భవన్ గేట్లు మూసివేత