సజ్జలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్
TeluguStop.com
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారన్నారు.ఈ నేపథ్యంలో లీకులు ఇవ్వడం ఎందుకన్న ఆయన వచ్చి అరెస్ట్ చేసుకోండని తెలిపారు.
తన గొంతు ఆగాలంటే ఎన్ కౌంటర్ చేయండి అంటూ కోటంరెడ్డి వ్యాఖ్యనించారు.తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండని పేర్కొన్నారు.
ఇసుకాసురులు, మద్యం వ్యాపారులపై కూడా ఆడియోలను రిలీజ్ చేయాలన్నారు.ఆ మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందని వెల్లడించారు.
అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.అధికారమే కావాలనుకుంటే గతంలోనే టీడీపీలో చేరేవాడినని చెప్పారు.
తన బిడ్డలపై విమర్శలు చేయొద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరారు.