పార్టీ నాయకులు, గృహ సారధులకు దశాదిశా నిర్దేశించిన ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో రూరల్ మండల వాలెంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల అవగాహన సదస్సు పార్టీ నాయకులు, గృహ సారధులకు దశాదిశా నిర్దేశించిన ఎమ్మెల్యే కొడాలి నాని 175 సీట్ల గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గృహసారధులను నియమించారు - ఎమ్మెల్యే కొడాలి నాని లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్ ప్రాంగణంలో గుడివాడ రూరల్ మండల పరిధిలోని సచివాలయ కన్వీనర్లు, వాలెంటీర్లు, గృహసారదుల అవగాహన సదస్సు నిర్వహించారు.

సదస్సులో ఎమ్మెల్యే కొడాలి నాని, వైఎస్ఆర్సిపి నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్ పాల్గొని గృహ సారధులకు దశాదిశా నిర్దేశించారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపులో గృహ సారధుల  భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

ప్రతిపక్షాలు చేస్తున్న విషపూరిత ప్రచారాన్ని వాలంటీర్లు, గృహసారుదుల సమన్వయంతో ప్రజలకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా గృహ సారుదులను, పార్టీ నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రజానీకానికి మేలు చేయాలని నియోజకవర్గ పరిశీలకులు పెదబాబు, శశిభూషణ్ పార్టీ శ్రేణులకు సూచించారు.

అనంతరం గృహ సారధులకు ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కిట్లను పంపిణీ చేశారు.

సదస్సులో మండల వైసిపి అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, జడ్పిటిసి గొల్ల రామకృష్ణ, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ మేకల సత్యనారాయణ,పార్టీ అనుబంధ విభాగాల నేతలు .

చివరిసారిగా మాట్లాంది నేనే .. కొడుకు మరణంపై సుచీర్ బాలాజీ తండ్రి ఆవేదన