బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని , బాపట్ల ఎంపీ నందిగం సురేష్

గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్.

మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికు ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు.

విగ్రహావిష్కరణ బహిరంగ సభలో ప్రసంగించిన ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ సురేష్.ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే తనకు ఇష్టం, మాజీమంత్రి అని పిలవద్దు.

మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానం, ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతా.చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారు, తనకు జగన్ వెనుక పని చేయడమే ముఖ్యం.

420 గ్యాంగ్ , చంద్రబాబు దత్త పుత్రుడు ,సొంత పుత్రుడు, రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది.దేవుడులాంటి వైఎస్ఆర్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యింది.

బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తా.

ఎంపీ సురేష్ కామెంట్స్ చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడెం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు.దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ తెల్ల మొఖం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నాడు.

తనకు మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానమని, ఎమ్మెల్యేగా ఉంటూ జగన్ వెంట నడవడమే ముఖ్యమని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన బాబు జగజ్జీవన్ రామ్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ,బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆవిష్కరించారు.

చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవులకోసం దేవుడు లాంటి వారికి వెన్నుపోటు పొడుస్తారని, తనకు జగన్ వెంట నడవడమే ముఖ్యమని పదవులు తృణపాయమని ఈ సందర్భంగా జరిగిన సభలో కొడాలి నాని అన్నారు.

చంద్రబాబు దత్త పుత్రుడు ,సొంత పుత్రుడు, రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారని,జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆయన ఉద్ఘాటించారు.

చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడెం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని,దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ తెల్ల మొఖం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నాడని ఎంపీ సురేష్ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ సురేష్ లను గ్రామస్తులు సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

ఏపీకి మళ్లీ సీఎం జగనే.. నాగన్న సర్వే లెక్కల ప్రకారం వైసీపీ సీట్ల లెక్క ఇదే!