జేసీ ప్రభాకర్ రెడ్డి పై సెటైర్లు వేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..!!
TeluguStop.com
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) రాజకీయాలలో ప్రత్యర్థులపై మంచి దూకుడు మీద వ్యవహరిస్తూ ఉంటారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో ప్రజా సమస్యల విషయంలో తన మార్క్ కనిపించేలా అందరి దృష్టిని ఆకర్షించేలా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
అధికారుల తీరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.ఇక పార్టీ కార్యకర్తల విషయానికొస్తే కుటుంబ సభ్యులు మాదిరిగా కలిసిపోతారు.
70 ఏళ్లకు పైగా వయసు మీద పడినా కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా ఉత్సాహంతో ఉంటారు.
తాజాగా ఆయన కుమారుడు జేసీ అశ్విత్ రెడ్డి( JC Ashwit Reddy ) పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలతో కార్యకర్తలతో సరదాగా చిందులు వేయడం జరిగింది.
ఈ క్రమంలో 73ఏళ్ళ వయసులో కూడా 18 సంవత్సరాల కుర్రాడు మాదిరిగా జేసీ.
డాన్సులు వేశారు. """/" /
పల్సర్ బైక్ సాంగ్ కి.
ఆయన చేసిన డాన్స్.కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో చాలా హైలెట్ గా నిలిచింది.
చాలా సందర్భాలలో పార్టీ కార్యక్రమాలలో ఇంకా అనేక వేదికల పైన జేసీ స్టెప్పులు వేశారు.
ఈ క్రమంలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యర్థి వైసీపీ నేత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy ).
జేసీ ప్రభాకర్ రెడ్డి పై కామెంట్లు సెటైర్లు వేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా కుమారుడు అస్మిత్ పుట్టినరోజు సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ టార్గెట్ చేసుకుని 73 ఏళ్ల వయసులో డాన్స్ అవసరమా అంటూ ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు తాడిపత్రిలో రౌడీయిజం చేసిన జేసీ.ఇప్పుడు డాన్సులు చేసుకునే పరిస్థితికి దిగజారారు అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
ఎవరి ఇంట్లోనైనా పుట్టినరోజు వేడుకలకు వచ్చి డాన్స్ చేసే పరిస్థితికి జేసీ దిగజారి పోయారు అన్నట్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి సెటైర్లు వేశారు.
ట్రంప్‌కు మళ్లీ చుక్కెదురు .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన ఫెడరల్ కోర్ట్