పరిటాల శ్రీరామ్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు..!
TeluguStop.com
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కబరస్తాన్ తొలగింపుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు.ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ముస్లింల సమాధుల తొలగింపును రాజకీయం చేయడం సరికాదని కేతిరెడ్డి అన్నారు.తమకు చెప్పి చేయాలని కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇది పూర్తిగా మత పెద్దలు తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు.నగరంలో ఉన్న మసీదు కమిటీలన్ని చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఇందులో తన జోక్యం ఎక్కడా ఉండదని తెలిపారు.సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?