జేసీ సోదరులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి .ప్రత్యర్థి నాయకులు జేసీ బ్రదర్స్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తనపై అక్రమ కేసులు పెడితే దానికి మూల్యం మీ ఇంటి నుంచి మొదలవుతుందని జేసీ బ్రదర్స్ ని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిస్తే.తాడిపత్రిలో జేసీ సోదరులు బీచ్చమెత్తుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీ అని చెప్పుకుంటున్నారు.అలాగైతే నియోజకవర్గంలో ప్రతి వైసీపీ కార్యకర్త.
నాయకుడు కూడా రౌడీలే.జేసీ సోదరులపై చర్యలు తీసుకోకపోతే.
ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
గత కొద్ది రోజులుగా తాడిపత్రి నియోజకవర్గం లో రాజకీయం రసవత్తరంగా ఉంది.ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పర్యటించి జేసీ సోదరులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో గొడవలు సృష్టించారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి తెలియజేయడం సంచలనంగా మారింది.
త్రివిక్రమ్ వివాదం… నటుడు శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్?