నారా లోకేశ్ కు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సవాల్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన విమర్శలకు బనగానపల్లె వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ లోకేశ్ పై ధ్వజమెత్తారు.

కమిషన్లు తీసుకున్నట్లు నిరూపించాలని లోకేశ్ కు ఎమ్మెల్యే కాటసాని సవాల్ విసిరారు.బీసీ జనార్థన్ రెడ్డి 420 అయితే లోకేశ్ 840 అని మండిపడ్డారు.

వ్యక్తిగత విమర్శలు చేస్తే బీసీ జనార్థన్ రెడ్డి బనగానపల్లెలో తిరగలేడని చెప్పారు.ఏదైనా మాట్లాడితే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే కాటసాని సూచించారు.

అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?