ఆ ఎమ్మెల్యేకు ఝలక్ ఇస్తున్న రెడ్డి నేత.. టికెట్ డౌటేనా..?
TeluguStop.com
పోయిన ఎన్నికల్లో ప్రభంజనం క్రియేట్ చేసిన వైసీపీలో వర్గ పోరు పెరుక్కుంటూ పోతుంది.
ఇది ఎక్కువగా బయట పడకపోయినా ఎక్కడో ఓ చోట మాత్రం రచ్చకెక్కుతోంది.దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం వరిస్తుందా? అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో కూడా ఇలానే రాజకీయం కాస్త రచ్చకెక్కింది.
దీంతో వైసీపీ పరువు మంట గలిసింది.అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకి వైసీపీ తణుకు శాఖ ప్రెసిడెంట్ ఎస్ ఎస్ రెడ్డికి మధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది.
ఇటీవల జగన్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కారుమూరి నిర్వహించారు.ఆ తర్వాత ఎస్ఎస్ రెడ్డి వర్గం తణుకులో వైఎస్సార్ పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ పెన్షన్ కార్యక్రమంలోనే గొడవ జరిగింది.నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాల్ని ఎలా చేస్తారని ఎమ్మెల్యే కారుమూరి ఎస్ఎస్ రెడ్డి మీద కోపానికి వచ్చారు.
దీంతో ఇద్దరి మధ్య కాసేపు వివాదం చెలరేగింది.దీనిపై గుర్రుగా ఉన్న ఎస్ ఎస్ రెడ్డి ఎమ్మెల్యే నాగేశ్వరరావు తన తల్లిని దూషించాడని ఆరోపిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
"""/" /
దీనిపై ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ.తణుకులో రెడ్డిలంతా తనకే సపోర్ట్గా ఉన్నారని కానీ ఓ రెడ్డి వ్యక్తి మాత్రం తనను ఎమ్మెల్యే కాకుండా చూస్తున్నాడని ఆరోపించారు.
ముందు నుంచి వస్తే పోరాడగలం కానీ వెన్నుపోటు రాజకీయాలు చేస్తే ఎలా పోరాడుతామని అన్నారు.
ప్రత్యేకంగా పేరు చెప్పకపోయినా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎస్ ఎస్ రెడ్డిని ఉద్దేశించినవే అంటున్నారు.
ఇప్పుడు ఈ పంచాయతీ కాస్త పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జి అయిన వైవీ సుబ్బా రెడ్డి దగ్గరకు చేరుకుంది.
మరి చూడాలి.2024లో తణుకు ఎమ్మెల్యే సీటు కారుమూరికి దక్కుతుందో? లేదా ఎస్ ఎస్ రెడ్డి సాధిస్తాడో?.
రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ ముగ్గురిలో గెలిచేది ఎవరు..?