అమలుకు నోచుకోని పోడు భూములపై సీఎం హామీ

పోడు భూములపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ బృందం గిరిజన సంఘం నాయకులతో కలిసి వివరించిన క్రమంలో పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తానని చెప్పిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) అన్నారు శనివారం పాలకవీడు మండలం శూన్యం పహాడ్ గ్రామంలో గిరిజన చైతన్య యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.

ఎన్నో ఏండ్లుగా అటవీ భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజనులందరికీ హక్కు పత్రాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిపిఎం,గిరిజన సంఘాల పోరాట ఫలితంగా,వామపక్షాల ఆమోదంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం(Forest Rights Act) తెచ్చిందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల 40 వేల మంది గిరిజనులు హక్కు పత్రాలకై దరఖాస్తు చేసుకున్నారని, మునుగోడు ఎన్నికల్లో చెప్పినట్లుగా ఫిబ్రవరి నెలలోనే పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజనులందరికీ పట్టాలిస్తామని చెప్పిన మాట నెరవేరలేదన్నారు.

సిపిఎం.సిపిఐ.

పార్టీల ఒత్తిడితో అసెంబ్లీలో అందరికీ హక్కు పట్టాలిస్తామని చెప్పి రాష్ట్రంలో 11లక్షల మంది గిరిజనులు దరఖాస్తు చేసుకుంటే కేవలం నాలుగు లక్షల మందికి హక్కు పత్రాలు ఇస్తామనటం సరికాదన్నారు.

సాగులో ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేనియెడల గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు సిపిఎం పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అనంత ప్రకాష్.తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధీరావత్ రవి నాయక్,రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలు నాయక్,రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ బంధువు చిత్రంలో రామోజీరావు కనిపించిన సినిమా ఏంటో తెలుసా..??