మంత్రి హరీష్ రావు పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్ లు
TeluguStop.com
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి.
ఇక వెలువడ్డ ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.
అయితే అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయకున్నా మెదక్ ఎమ్మెల్సీ స్థానంపై కాంగ్రెస్ కొంత నమ్మకం పెట్టుకున్న పరిస్థితి ఉంది.
అయితే మొదట్లో మంత్రి హరీష్ రావు మెదక్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని అనుకున్నా కాని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకగ్రీవానికి ససేమిరా అనడంతో ఇక ఎన్నిక నిర్వహించక తప్పలేదు.
అయితే ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన మాట వాస్తవం.అయితే కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి సతీమణి ఓడిపోయారు.
"""/" /
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నైతిక విజయం తమదే అని ట్రబుల్ షూటర్ హరీష్ రావు ను వెనక్కి నెట్టడంలో సఫలమయ్యామని ట్రబుల్ షూటర్ ను ట్రబుల్ లో పడేశామని మాకున్న బలం 231 స్థానాలు అయితే ఇంకా ఎక్కువగా 7 ఓట్లు మాకు వచ్చాయని ఆ ఓట్లు ఎవరివో తమకు తెలియదని దీనిని బట్టి చూస్తే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా కాంగ్రెస్ కు మద్దతు పలికారని టీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని సెటైర్ లు వేశారు.
అయితే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.
అంతేకాక కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయిన రవీందర్ సింగ్ సైతం టీఆర్ఎస్ కు అత్యంత బలం ఉన్నా ఇండిపెండెంట్ కు ఓట్లు వచ్చాయంటే ఇది నా నైతిక విజయం అని వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఎక్కడా ఓటమిని ఒప్పుకోనటువంటి పరిస్థితి ఉంది.
అయితే ఇది ఒక రాజకీయ వ్యూహమని పార్టీ ప్రతిష్ట కొరకు చేసే వ్యాఖ్యలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఫిమేల్ స్టూడెంట్ తెలివి అదుర్స్.. ఏం చేసిందో చూడండి..