అయోద్య రామ మందిరంకు ముహూర్తం ఖరారు

ఎన్నో సంవత్సరాలుగా నానుతూ వస్తున్న అయోద్య రామ మందిర నిర్మాణం అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశాడు.

హిందువులు చాలా ఏళ్లుగా అయోద్య రామ మందిరం కోసం ఎదురు చూస్తున్నారు.ముస్లీంలు మందిర నిర్మాణంను అడ్డుకుంటున్నారు.

సుప్రీం కోర్టులో ఈ కేసు దశాబ్దాలుగా వాయిదాలు పడుతూ వస్తోంది.ఎట్టకేలకు ఈ కేసు సుప్రీంలో చివరి దశకు చేరుకుంది.

కేసు విచారణ ముగిసిందని, తుది తీర్పు ఇవ్వబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే రామ మందిర నిర్మాణంకు డేట్‌ ఫిక్స్‌ అంటూ ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది.

వచ్చే నెల 18వ తారీకున అయోద్యలో రామ మందిర నిర్మాణంకు శంకుస్థాపన జరుగబోతుందని డేట్‌తో సహా ఎమ్మెల్యే గైన్‌ చంద్‌ ప్రకటించడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

ఇటీవలే సీఎం యోగి ఆధిత్య నాద్‌ మాట్లాడుతూ అతి త్వరలోనే రామ మందిరం గురించి గుడ్‌ న్యూస్‌ వింటారంటూ చెప్పడం ఇప్పుడు ఎమ్మెల్యే నవంబర్‌ 18న రామ మందిరం శంకుస్థాపన అంటూ ప్రకటించడంతో సర్వత్ర ఉత్కంఠ కనిపిస్తోంది.

అసలేం జరుగుతుందా అంటూ దేశ వ్యాప్తంగా హిందూ ముస్లీంలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?