వేములవాడ పట్టణ, అర్బన్ రూరల్ మండలాల లబ్ధిదారులకు 92 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఒకప్పుడు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపడుచు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడేవారని కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు అనేకం ఉన్నాయని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు వ్యాఖ్యానించారు.
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లి చేయాలనే సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎవరు చేపట్టని గొప్ప పథకాలను ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలకు సొంత మేనమామగా మారి గొప్ప మనసు చాటుకున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.
వేములవాడ పట్టణంలోని అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ, అర్బన్ రూరల్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 92 కల్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపింణి చేశారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ మండల ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, అర్బన్ జడ్పిటిసి మ్యాకల రవి, రూరల్ జెడ్పిటిసి ఏష వాణి తిరుపతి, అర్బన్ సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, అర్బన్ రూరల్ మండలాల రెవెన్యూ అధికారులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, నాయకులు గోస్కుల రవి, శ్రీనివాస్ రావు, అర్సీ రావు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలుగు సినిమాలను చూస్తూ డైరెక్షన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు…