గిరిజన యువకుడిపై ఎమ్మెల్యే దాదాగిరి

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ ( MLA Nomula Bhagat ) పెద్దవూర మండలం నిమ్మా నాయక్ తండాకు చెందిన గిరిజన యువకుడిని నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

నిమ్మా నాయక్ తండా గ్రామపంచాయతీ నుండి మా తండాను వేరు చేయద్దని ఎమ్మెల్యే నోముల భగత్ కు ఓ గిరిజన యువకుడు విజ్ఞప్తి చేశాడు.

దీనితో ఎమ్మెల్యే నోముల భగత్ కు చిరెత్తుకొచ్చిందేమో నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ,గిరిజన యువకున్ని జుట్టు పట్టుకుని ఇంటి నుండి గెంటి వేయడం జరిగింది.

దీనితో ఎమ్మెల్యే నోముల తీరుపై గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి.ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శనివారం పెద్దవూర మండల కేంద్రంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.

ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అడుక్కొని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా అఖిల భారత బంజారా సేవా సంఘం అధ్యక్షులు సపావత్ పాండు నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంగా ప్రజా ప్రతినిధికి ఒక సమస్యపై చెప్పడానికి వెళ్ళిన గిరిజన యువకుడిని భూతులు తిట్టి,చేయి చేసుకోవడం, ఇంటి నుండి గెంటేయడం అత్యంత అమానుషమని,దీనిని తీవ్రంగా ఖండిస్తున్నమని అన్నారు.

అలాగే మొన్న మా గిరిజన నాయకుడిని కూడా ఇష్టానుసారంగా తిట్టినట్లు తెలిసిందని,ఎమ్మెల్యే తరచూ గిరిజనులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని,రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

ఈ ఘటనపై వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని,ఎమ్మెల్యే నోముల భగత్ ను ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేసి,బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి వారికి పార్టీ టికెట్ ఇస్తే పార్టీకే నష్టమని అన్నారు.

వీడియో వైరల్.. ఫన్నీ టమాటా రైమ్‭తో అదరగొట్టిన టీచర్లు!