పొలిటికల్ సర్కిల్స్‌లో రచ్చగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. ఇంత దారుణంగా మాట్లాడారా..??

తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు కాస్త దూకుడు ఎక్కువే అని ఎన్నో సంధర్బాల్లో నిరూపించారు.

కొన్ని సమయాల్లో అయితే వారి మాటలు అధిష్టానానికి కూడా కోపం తెప్పించాయట.ఇది వరకే అయోద్య రామమందిరం నిర్మాణంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నేతలు తాగాజా పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి హత్యకేసులో కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారట.

ఇప్పటికే ఈ హత్యలో పుట్టా మధుపై వస్తున్న ఆరోపణలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కాగా తాజాగా మరో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో హాట్ టాపిక్‌గా మారాయట.

ఈయన ఎంత దారుణంగా మాట్లాడారో తెలుసుకుంటే.పవర్ లో ఉన్నాం.

అంతా మా ఇష్టం.అంతకు మించి సీతయ్యలమంటూ క్లారిటీ ఇచ్చారట.

అదీగాక ఎవరైనా సరే తాము చెప్పింది వినాల్సిందేనంటూ, మా దయాదాక్షిణ్యాలు ఉంటేనే పోస్టింగ్ లో ఉంటారు.

లేకపోతే తట్టా, బుట్టా సర్దుకుని పోవాల్సిందే అని వివాదస్పదంగా వ్యాఖ్యానించారట.ఇంతలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు ఎవరంటే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో రచ్చ చేస్తున్నాయని సమాచారం.

దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!