మున్సిపల్ పరిధిలో రోడ్లు పూర్తి చేయాలి:ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా:గత 10 ఏళ్లుగా దేవరకొండ మున్సిపల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రోడ్లను పూర్తి చేయాలని, వాటికి కావలసిన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అధికారులను ఆదేశించారు.

శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ త్వరలో దేవరకొండలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా మార్చబోతున్నామని తెలిపారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు,సిబ్బంది ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!