హిందూపురం ప్రభుత్వ పాఠశాలలకు 30 ఎల్ఈడి టీవీలను ఉచితంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు హిందూపురంలో అంధుల పాఠశాలను, నవోదయ విద్యా సంస్థతో పాటు పలు విద్యాసంస్థలు తెచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకి చెందుతుందని ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి సోషల్ మీడియా వైపు వెళ్ళవద్దు, మంచి సందేశాన్నిచ్చే సినిమాలను చూడండి, ఫేస్బుక్ లకు దూరంగా ఉండండి అని బాలకృష్ణ అన్నారు.

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం చెందిన ప్రభుత్వ పాఠశాలలకు 4 లక్షల 50 వేల విలువచేసే 30 ఎల్ఈడి టీవీలను సినీనటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఉచితంగా పంపిణీ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు హిందూపురంలో గతంలో చదివిన విద్యార్థిని విద్యార్థులు దేశంలో ఉన్నత స్థాయి లో ఉన్నారని, వారి చదువులకు ప్రోత్సహించింది స్వర్గీయ నందమూరి తారకరామారావు అని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అభివృద్ధిశూన్యం అని, ఈరోజు రాష్ట్రంలో రోడ్లు అధ్వానం స్థితిలో ఉంటే చివరకు గుంతలు పూడ్చిన పాపాన కూడా పోలేదని మండిపడ్డారు.

ప్రతి ఒక్కరు ఎండలో కొద్దిసేపు ఉంటే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుందని అదే తాను ఎండలో తిరిగితే ప్రభుత్వానికి బాదుడే బాదుడు అని ఘాటుగా సమాధానమిచ్చారు.

నా జీవితాన్ని మార్చేసిన సినిమా అది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బన్నీ?