మల్లో సారి మోడీ అధికారంలోకి వస్తే చేతికి చిప్ప బతుకంతా కుప్ప – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
TeluguStop.com
మోడీ దేశంలో మరోసారి అధికారంలోకి వస్తే దేశ ప్రజల చేతికి చిప్ప ఇస్తాడని, రిజర్వేషన్లు రద్దు చేస్తాడని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.
సోమవారం కథలాపూర్ మండలం కలికోట, అంబారీపేట గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారన్ని నిర్వహించారు.
వారు మాట్లాడుతూ మే 13 జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
దేశంలో బిజేపి మల్లోసారి అధికారంలో కి వస్తె బిసి,ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్లలో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు.
దయచేసి ప్రజలారా ఆలోచించండి మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి, దేశంలో రాజ్యాంగం బతకడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి.
పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో ప్రజలు పేద ప్రజలుగ తీరోగమనం చెందారన్నారు.రిజర్వేషన్లు రద్దు చేస్తాడానటానికి నిదర్శనం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులుగా దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ల భర్తీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 49.
50 శాతం ఉద్యోగలు రావాల్సి ఉండగా కేవలం 27% ఉద్యోగాలు దక్కినట్లు తేలిందన్నారు.
దేశంలో ఎస్టీ ఎస్సీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం జనాభా లెక్కలు జరిపి రిజర్వేషన్లను కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో చెప్పారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కుల గణన కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు.
బిజెపి ప్రభుత్వం బీసీలకు ఓబిసిలకు రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్రలు పన్నుతున్నధన్నారు.మండల్ కమిషన్ వి.
పి.సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 50% మించకుండా సుప్రీంకోర్టు రిజర్వేషన్ కల్పించుకోవాలని తీర్పు వచ్చినపుడు ఎస్సీ ఎస్టీల కు తోడుగా బీసీ లకు కూడ 27 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు.
ఆనాడు ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడారని ప్రజలంతా గమనించాల్సిందిగా పేర్కొన్నారు.రిజర్వేషన్ రద్దు ఆర్ఎస్ఎస్ ఎజెండా అనీ ఆరోపించారు.
రిజర్వేషన్ల రద్దుకయ్యి మోడీ, అమిత్ షా లు కుట్రలు చేస్తున్నారని, దేశంలో రాజ్యాంగం బతకాలన్న రిజర్వేషన్లు ఉండాలన్న ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)