లక్షలు పెట్టి సెక్యూరిటీ ఏర్పాటు.. అయినా ఆ కాస్ట్ లీ మామిడి తోటలో దొంగలు!

మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో లక్షల రూపాయల విలువైన విదేశీ రకపు మియాజాకీ మామిడి పండ్లను పండిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో వాటి రేటు చాలా చాలా ఎక్కువ.

అందులోనూ ఆ మామిడి పండ్లు విత్తనాలు తయారు చేయడానికి పెంచుతున్నారు.కాస్ట్లీ మామిడి పండ్లు కావడంతో ఎవరైనా తెంపుకుపోతారన్న భయం ఉంటుంది.

అందులోనూ ఈ మియాజాకీ మామిడి పండ్ల ఖరీదు లక్షల్లో ఉండటంతో దొంగల భయం ఎక్కువగానే ఉంటుంది.

జపనీస్ ఎగ్ ప్లాంట్ గా పిలిచే ఈ రకం మామిడి పండ్ల ధర కిలో ఏకంగా రూ.

2.70 లక్షలు.

అందుకే లక్షలు ఖర్చు పెట్టి భద్రత ఏర్పాటు చేశాడు రైతు సంకల్ప సింగ్ పరిహార్.

ముగ్గురు సెక్యూరిటీ గార్డులను, 15 శునకాలను కాపలాగా పెట్టాడు.మామిడి తోట చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.

నిత్యం కాపలా కాస్తుంటారు.జబల్ పుర్ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో హినౌతా గ్రామంలోని శ్రీ మహాకాళేశ్వర్ హైబ్రిడ్ ఫాంహౌస్ లో వీటిని సాగు చేశారు రైతు సంకల్ప్.

మొత్తం 3,600 మొక్కలు నాటారు.దేశంలోని రకాలే కాకుండా విదేశాలకు చెందిన దాదాపు 8 లక్షల మామిడి మొక్కలను పండించారు సంకల్ప్.

అయితే గోడలు దూకి, భద్రతను దాటుకుని వస్తారనుకుని నిఘా ఏర్పాటు చేయగా.దొంగలు మరో దారి గుండా వచ్చి తీరని నష్టాన్ని చేశారు.

కొన్ని రోజుల క్రితం గుజరాత్ నుండి తోటను చూసేందుకు వచ్చిన పెద్ద కుటుంబాలకు చెందిన మహిళలు కొన్ని పండ్లను దొంగలించినట్లు సంకల్ప్ పరిహారం వెల్లడించారు.

ఆ మహిళలను మియాజాకీ రకానికి చెందిన మామిడి పండ్లను తమ బ్యాగుల్ల పట్టుకెళ్లారని.

ఆ తతంగం అంతా సీసీటీవీల్లో రికార్డు అయిందన్నాడు.వారిని వెళ్లి అడిగితే.

మమ్మల్ని దొంగల్ని చేస్తారేంటి అని అన్నారని సంకల్ప్ చెప్పాడు.వాళ్ల హ్యాండ్ బ్యాగుల్లో, కార్లలో మాత్రం మామిడి పండ్లు కనిపించాయని.

వాటి గురించి అడిగితే గొడవ పెట్టుకున్నారని సంకల్ప్ సింగ్ పరిహార్.పంట నిర్వహణకు లక్షలు ఖర్చు పెట్టినా.

ఈ ఏడాది మాత్రం భానుడి ప్రతాపం, ప్రతి కూల వాతావరణంలో దిగుబడి ఆశించినంత రాలేదని చెప్పారు సంకల్ప్.

పండ్లు రాలి పోవడం, పక్వానికి రాక ముందే పసుపు రంగులోకి మారాయని సంకల్ప్ పేర్కొన్నారు.

ఓవైపు దిగు బడి తగ్గి.మరో వైపు దొంగతనం జరగడంతో లక్షల నష్టం కలిగిందని చెప్పాడు సంకల్ప్.

మహాకాల్ బాబా పైనే నమ్మకం పెట్టుకున్నానని వెల్లడించాడు.

మణిపూర్ : భారత సంతతి ప్రొఫెసర్‌పై కేసు నమోదు.. ఖండించిన కుకీ విద్యార్ధి సంఘం