వృద్దునికి నిత్యావసర సరుకుల దుప్పట్లు పంపిణీ చేసిన మిత్ర యూత్ సభ్యులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో మంగళవారం యువ మిత్ర యూత్ అధ్యక్షులు యాద ప్రేమ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు.
గ్రామంలో నివాసముంటున్న నాగారం కొమురయ్య అనే వృద్దుడికి సరియగు వసతులు లేవని తెలుసుకొని యువ మిత్ర యూత్ సభ్యులు దుప్పట్లు, బియ్యం, నిత్యావర సరుకులను అందించారు.
గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో స్వీట్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువ మిత్ర యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నాకు యాక్టింగ్ రాదు.. అందుకే శరీరం చూపించా.. పూజాబేడీ సంచలన వ్యాఖ్యలు!