అమితాబ్ మెయిన్ లీడ్ గా హిందీలోకి వెళ్తున్న మిథునం

టాలీవుడ్ లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన సినిమా మిథునం.

రెండే పాత్రలతో ట్రావెల్ చేసే ఈ సినిమా స్టోరీ అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంది.

టీవీలలో వస్తే ఇప్పటికి చాలా మంది చూస్తారు.రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉండే ఈ సినిమా కథ, కథాంశం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కళాత్మక సినిమాల కేటగిరీలోకి ఈ సినిమా వెళ్ళింది.ఇలాంటి కళాత్మక సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధం అయ్యింది.వయసు మీదపడి వృద్ధాప్యంలో ఈ జంట సొంత ఊరులో తమ శేషజీవితాన్ని ఆడుతూ పాడుతూ అనుభూతుల, అనుభవాల సమ్మేళనంగా ఎంత అందంగా గడిపారన్నది వెండితెరపై రమణీయంగా ఆవిష్కృతమైన తీరు ప్రేక్షకుల హృదయాలను గాఢంగా హత్తుకుంది.

బాలు నటించిన సినిమాలలో ఎప్పటికి గుర్తుంచుకోదగ్గ సినిమాగా ఇది మిగిలిపోయింది.ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుందట.

హిందీలో దీనిని అమితాబ్ బచ్చన్, రేఖ జంటతో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

వీరిద్దరి కాంబినేషన్ అంటే సినిమాకి హైప్ క్రియేట్ అయ్యి బాగా ప్రచారంలోకి వస్తుందని, ఎలాగూ కంటెంట్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే కేవలం రెండే పాత్రలతో సాగే ఇలాంటి కళాత్మక కథని హ్యాండిల్ చేయగలిగే దర్శకుడు ఎవరున్నారు అని నిర్మాణ సంస్థ చూస్తున్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ లో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ఎన్నో వచ్చిన ఈ జోనర్ లో తెరకెక్కి హిట్ అయినవి చాలా తక్కువ అని చెప్పాలి.

ప్రదర్శన సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురైన ‘గర్బా కింగ్’.. చివరకు(వీడియో)